MachilipatnamLocal News
January 14, 2026
కృష్ణా జిల్లా

యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి–– జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గుట్టాల గోపి

  • January 9, 2026
  • 0 min read
[addtoany]
యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి–– జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గుట్టాల గోపి
మచిలీపట్నం :
 
యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, చెడు వ్యసనాలకు లోనై జీవితాలను దుర్భరం చేసుకోవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గుట్టాల గోపి యువతకు పిలుపునిచ్చారు.శుక్రవారం జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, విద్యార్థులతో కలిసి జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి నగరంలోని సాయిబాబా గుడి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు.
 
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించి యువత భవిష్యత్తును కాపాడేందుకు జాతీయ న్యాయసేవాధికార సంస్థ (ఎన్ఎల్ఎస్ఏ) డ్రగ్స్ అవేర్నెస్ వెల్నెస్ నావిగేషన్ (డాన్) అనే పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఎన్ఎల్ఎస్ఏ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.
 
ప్రపంచంలో అత్యధిక యువత జనాభా కలిగిన దేశం భారత్ అని, అయితే దేశంలోని యువత గంజాయి వంటి మత్తుపదార్థాలకు బానిసై తమ జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ సంపద దేశ సంపదని పేర్కొంటూ అటువంటి విలువైన సంపదలో యువతది కీలక పాత్ర అని, అటువంటి యువత జీవితాలు చెడు వ్యసనాలకు లోను కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తద్వారా ఇది దేశ అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందన్నారు. దాదాపు 75 సంవత్సరాలుగా ప్రపంచ దేశాలు భారతదేశాన్ని అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే గమనిస్తున్నారు గాని, అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించడం లేదని, ఇది కేవలం, యువత చెడు వ్యసనాలకు లోనై వాటి దుష్ప్రభావాలతో యువత నిర్వీర్యం కావడం కారణం అని పేర్కొన్నారు. యువత అనేక రకాల మత్తు పదార్థాలకు లోను కాకుండా ఉండేందుకు, తమ పిల్లలు సరైన మార్గంలో పయనించాలంటే తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అదేవిధంగా పాఠశాల, కళాశాల యాజమాన్యాలు పరిశోదాత్మకంగా పరిశీలిస్తూ విద్యార్థుల ప్రవర్తనపై దృష్టి పెట్టాలని సూచించారు. 
 
కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కేవీ రామకృష్ణయ్య, అదనపు సీనియర్ సివిల్ జడ్జి సిహెచ్ యుగంధర్, తొమ్మిదవ అదనపు జిల్లా జడ్జి ఎస్ సుజాత, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి హిమబిందు తదితర న్యాయమూర్తులు, న్యాయవాదులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *