కృష్ణా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో భారతదేశ ఔన్నత్నాన్ని ప్రపంచ దశదిశలా చాటిన స్వామీ వివేకానంద జన్మదినోత్సవాన్ని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డా ఆర్. విజయ కుమారి మాట్లాడుతూ స్వామి వివేకానంద రామకృష్ణ మఠాన్ని స్థాపించి తద్వారా భారత యువతకు పలువిధాల దిశా నిర్దేశం చేశాడని, ముప్పై తొమ్మిధి ఏళ్ళ వయసు లోనే మరణించినా ముందు తరాలకు గుర్తుండేలా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని జాతీయ యువజన దినోత్సవం గా ప్రకటించిందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు ఆర్. దుర్గాప్రసాద్, డా పి. గోపి, కే. కవిత, ఇంజనీరింగ్ కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.