MachilipatnamLocal News
January 14, 2026
కృష్ణా జిల్లా

గంజాయి పై ఉక్కు పాదం….. కృష్ణాజిల్లా కలెక్టరు

  • January 9, 2026
  • 0 min read
[addtoany]
గంజాయి పై ఉక్కు పాదం….. కృష్ణాజిల్లా కలెక్టరు
మచిలీపట్నం :
 
జిల్లాలో గంజాయి అమ్మకాలను నియంత్రించేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. 
 
శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో జిల్లా ఎస్పీ వీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి నార్కోటిక్స్ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి సమీక్షించారు. 
 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితులను గంజాయి గానీ మాదకద్రవ్యాలు గాని అమ్మకాలు జరగరాదన్నారు. 
 
కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో గట్టి నిఘా ఉంచి గంజాయి అమ్మకాలను నియంత్రించాలన్నారు. 
ముఖ్యంగా చేపలు, రొయ్యలు చెరువుల దగ్గర పనిచేసే బీహార్, బెంగాలు తదితర రాష్ట్రాల వలస కూలీల జాబితా సేకరించి వారిపై గట్టి నిఘా ఉంచాలన్నారు. 
అలాగే వ్యవసాయ కూలీలు గా పనిచేసే ఇతర రాష్ట్రాల వారిపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 
 
పరిశ్రమల వద్ద కూడా పనిచేసే వలస కూలీల జాబితా సేకరించి వారి కార్యకలాపాలను గమనించాలన్నారు. 
పాఠశాలలు, వసతి గృహాలు, వైద్య,ఇంజనీరింగ్ తదితర కళాశాలల్లో కూడా ఆకస్మిక తనిఖీలు చేసి గంజాయి అమ్మకాలు ఏమైనా జరుగుతున్నాయా గమనించాలన్నారు. 
మందుల దుకాణాలను కూడా ఆకస్మిక తనిఖీ చేయాలన్నారు.
భవన నిర్మాణాల వద్ద కూడా ఇతర ప్రాంతాల కూలీలు వివరాలను సేకరించాలన్నారు.
మత సంబంధమైన ఉత్సవాలు జరిగిన సందర్భంలో ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారిపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఇందుకోసం సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, మత్స్యశాఖ, విద్యాశాఖ, పరిశ్రమల శాఖ సిబ్బంది మహిళా పోలీసులు రెవెన్యూ సిబ్బందినీ చైతన్య పరిచేందుకు తొలుత గంజాయి అమ్మకాల పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు
 
సంక్రాంతి పండుగ తరువాత తాను, జిల్లా ఎస్పీ కలిసి సంయుక్తంగా మూడు డివిజన్లలో గంజాయి అమ్మకాలు, సైబర్ నేరాలు, పోక్సో చట్టం తదితర ముఖ్యమైన విషయాలపై అవగాహన శిబిరాలను నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. 
అమాయకులను ఎవరిని కూడా అనవసరంగా గంజాయి కేసులలో ఇరికించరాదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. నిజంగా గంజాయితో సంబంధం ఉండి ఉంటే తప్పకుండా వారిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయాలన్నారు.
 
జిల్లా ఎస్పీ వీ. విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ జిల్లాలో గంజాయికి సంబంధించి 36 కేసులను నమోదు చేశామన్నారు. జిల్లాలో 150 మందిని నిందితులను అరెస్టు చేసి 1,07,32,795 రూపాయల విలువ గల 475.261 కిలోల గంజాయిని, ఓక గ్రాము కోకిన్, 116 గ్రాముల సిరప్, ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.
 
మరో 407 మంది గంజాయితో సంబంధం ఉన్న నిందితులను గుర్తించామని వారి కార్యకలాపాలను గమనిస్తున్నామన్నారు.
జిల్లాలోని కొన్ని సంబంధిత ప్రభుత్వ శాఖలు, మహిళా పోలీసు అధికారుల సమన్వయంతో అన్ని గ్రామాలు పట్టణాలు ప్రముఖ ప్రదేశాలు, విద్యాసంస్థల్లో గంజాయి విక్రయాలపై, చెడు వ్యసనాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 
పాఠశాలలు, కళాశాలల్లో 326 ఈగల్ క్లబ్బులు ఏర్పాటు చేశామన్నారు. 
ఎవరికైనా గంజాయి విక్రయాలపై సమాచారం తెలిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ హౌస్ అధికారికి తెలియజేయాలని ప్రజలకు తెలుపుతున్నామన్నారు 
 
 పోలీస్ స్టేషన్ హౌస్ అధికారి వారి పరిధిలో వారంలో 3 రోజులు 3 గ్రామాల్లో పర్యటించి ఫోక్సభ చట్టం, సైబర్ నేరాలు, గంజాయి విక్రయాలు, మాదకద్రవ్యాల విక్రయాలు పై ప్రజలకు అవగాహన కల్పించనున్నామన్నారు.
గంజాయి అమ్మకాల నియంత్రణలో అన్ని ప్రభుత్వ శాఖలు తమ వంతు సహకారం అందించాలని కోరారు.
 
ఈ సందర్భంగా గంజాయిని వ్యతిరేకిస్తూ పోలీస్ శాఖ రూపొందించిన వివిధ రకాల గోడపత్రాలను జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు.
 
అలాగే ఆకర్ష ఫౌండేషన్ అధినేత ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ గర్రె శంకర్రావు రూపొందించిన మత్తు పదార్థాలకు దూరంగా యువత ఉండాలని తెలియజేసే పుస్తకాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
 
ఈ సమావేశంలో మచిలీపట్నం ఇన్చార్జ్ ఆర్డిఓ పోతురాజు డిఎస్పి సిహెచ్ రాజా, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ యుగంధర్, మత్స్యశాఖ జేడీ అయ్యా నాగరాజా, విద్యాశాఖ ఏడి విద్యాలత, జి ఎస్ టి ఓ సర్దార్ పాషా, జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, డి డి సి ఓ అన్వేష్ రెడ్డి, జి జి హెచ్ ఆర్ ఎం ఓ నిరంజన్ రెడ్డి, ఈగల్ పోలీస్ ఇన్స్పెక్టర్ రవీంద్ర, మురళీమోహన్, కే మూర్తి ,మంగినపూడి, గిలకలదిండి, పాలకాయ తిప్ప, ఓర్లగుందితిప్ప పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, ఆకర్ష ఫౌండేషన్ ప్రతినిధి హరిత, ఆన్లైన్లో గుడివాడ ఆర్డిఓ జి బాలసుబ్రమణ్యం, ఉయ్యూరు ఆర్డిఓ బిఎస్ హేలా షారోన్ తదితర అధికారులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *