జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు సాంప్రదాయేతర జూద క్రీడలపై ఉక్కుపాదం మోపుతోంది జిల్లా పోలీసు యంత్రాంగం. కోడిపందాలకు కాలు దువ్విన, కత్తుల తయారీకి పాల్పడిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఈరోజు కూచిపూడి ఎస్సై శిరీష గారికి రాబడిన సమాచారం మేరకు కూచిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యంకి గ్రామం కొత్త కాలనీలో కోడి పందెములకు ఉపయోగించే కోడి కత్తులు తయారు చేస్తున్నట్లు రాబడిన సమాచారం పై ఎస్సై గారు సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడులు నిర్వహించగా 421 కోడి కత్తులు మరియు కోడి కత్తులు తయారు చేయడానికి ఉపయోగించే 5 మిషన్లు స్వాధీనం చేసుకుని, 5 మంది వ్యక్తులను అదుపులోనికి తీసుకొని సదరు వ్యక్తుల పై కూచిపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
సాంప్రదాయ ముసుగులో ఎవరైనా చట్ వ్యతిరేకమైన జూద కార్యకలాపాలు నిర్వహిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడేది లేదని, జూద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.