హెల్మెట్ ను భారంగా కాకుండా బాధ్యతగా స్వీకరించి ధరించండి – జిల్లా ఎస్పీ విద్యసాగర్ నాయుడు
SSN
- January 8, 2026
- 0 min read
[addtoany]
నిర్లక్ష్యంగా ద్విచక్ర వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడొద్దు. మీ కుటుంబాన్ని అంధకారంలోకి నెట్టి వేయవద్దు
హెల్మెట్ ర్యాలీలో పాల్గొని హెల్మెట్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ.
మచిలీపట్నం :
హెల్మెట్ ధరించడాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా స్వీకరించి ధరించాలని దాన్ని భారంగా భావిస్తే మన కుటుంబ భారం ఇతరులపై పడుతుందని నిర్లక్ష్యాన్ని వీడి ప్రతి ఒక్కరు ద్విచక్ర వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని గురువారం కోనేరు సెంటర్ నుండి నిర్వహించిన హెల్మెట్ ర్యాలీలో జిల్లా ఎస్పీ వి. విద్యసాగర్ నాయుడు స్వయంగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడిపి ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ హెల్మెట్ ర్యాలీ కోనేరు సెంటర్ నుండి కోటతుల్ల వారి సెంటర్, నాయర్ బట్టి సెంటర్ పరాసు పేట, లక్ష్మీ టాకీస్ సెంటర్, రేవతి సెంటర్ మీదుగా తిరిగి కోనేరు సెంటర్ వరకు నిర్వహించగా ఈ కార్యక్రమాన్ని ఎస్పీ అడిషనల్ ఎస్పీ ఇతర పోలీసు అధికారులతో కలిసి జండా ఊపి ప్రారంభించారు.
అందులో భాగంగా హెల్మెట్ యొక్క వినియోగం దాని యొక్క ఉపయోగాలు గూర్చి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు సిబ్బంది నగర ప్రజలు ఉత్సాహంగా పాల్గొని హెల్మెట్ ధరించి పురవీధుల వెంబడి ద్విచక్ర వాహనాలు నడిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కృష్ణా జిల్లావ్యాప్తంగా అత్యధిక భాగం జాతీయ రహదారికి అనుసంధానం కలిగి ఉంది. జాతీయ రహదారుల వెంబడి గాని మారుమూల గ్రామ పట్టణ ప్రాంతాల్లో ఉన్న రహదారులపై గాని రాష్ట్రవ్యాప్తంగా అనేక రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
జిల్లావ్యాప్తంగా జరిగిన రహదారి ప్రమాదాలను గమనిస్తే అత్యధిక శాతం ద్విచక్ర వాహనాల మీద వెళ్లేవారు ప్రమాదాలకు గురై హెల్మెట్ ధరించకపోవడం వలన మరణ బారిన పడుతున్నారు. రహదారి ప్రమాదాల బారినపడి గాయపడిన వారిని గమనిస్తే హెల్మెట్ ధరించడం వలన గాయపడిన వారే తప్ప మరణించిన దాఖలాలు ఎక్కడా లేవు. హెల్మెట్ యొక్క ఉపయోగం గూర్చి ప్రజల్లో కృష్ణా జిల్లా పోలీస్ శాఖ తరపున విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అలాగే ధరించని వారిపై జరిమానా విధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కొంతమందిలో అవగాహన లేకపోవడం కారణంగా ధరించడాన్ని విస్మరిస్తున్నారు.
హెల్మెట్ ధరించడం సమాజానికి మీరు చేసే మేలు కాదు. మీరు మీ కుటుంబానికి రక్షణ కవచంగా నిలవడం. అనుకోని ప్రమాదం ఏదైనా సంభవిస్తే మీ కుటుంబం రోడ్డున పడకుండా మీరు వారికి అందించే భరోసా. హెల్మెట్ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించి ఏ ఒక్కరు ప్రమాదాల బారినపడి మరణించకుండా తీసుకుని చర్యల్లో భాగమే. హెల్మెట్ ధరించడాన్ని భారంగా భావించొద్దు. మీ కుటుంబానికి మీరు అందించే బాధ్యతగా స్వీకరించండి అన్నారు.
గడిచిన డిసెంబర్ నెల మొత్తం జాతీయ రహదారిపై నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మంచు కారణంగా జరిగే ప్రమాదాలను నియంత్రించడానికి, అత్యధిక వేగం నియంత్రించడానికి, రేడియం స్టిక్కర్లతో కూడిన డ్రమ్ములు ఏర్పాటు చేయడం, సైన్ బోర్డు, హెచ్చరికలు, బార్ గేట్స్ ఏర్పాటు చేయడం కారణంగా డిసెంబర్ నెల మొత్తాన్ని గమనిస్తే రహదారి ప్రమాదాల కారణంగా మరణాలు గణనీయంగా తగ్గాయి అని
ప్రజలందరికీ తెలియజేసేది ఏమంటే నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురికావద్దు. అలాగే భర్త గదున వెళ్లాలని అడ్డదారుల్లో ప్రయాణాలు సాగించి మీకే కాకుండా మీ తోటి వారి ప్రమాదాలకు కారణం కావొద్దు అని వివరించారు.
హెల్మెట్ ధారణ పై జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతారు వారిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించడం జరుగుతుందని, కావున ప్రజలందరూ పోలీస్ వారికి సహకరించి సురక్షితంగా మీ గమ్యస్థానాలకు చేరేలా భద్రతా ప్రమాణాలు పాటించాలని తెలిపారు.

