– కమిషనర్ బాపిరాజు పర్యవేక్షణలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది కొలతలు
– వైఎస్సార్‌సిపి జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని సమక్షంలో కొలతలు
–హైకోర్టు ఆదేశాలంటూ కొలతలపై పూర్తి వివరాలు తెలపని కమిషనర్
మచిలీపట్నం :
మంగళవారం నగరంలోని జిల్లా కోర్ట్ సెంటర్ సమీపంలో నిర్మించిన వైఎస్సార్ సిపి జిల్లా కార్యాలయ భవనానికి నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, సిబ్బంది కమిషనర్ సిహెచ్‌వివిఎస్ బాపిరాజు పర్యవేక్షణలో కొలతలు వేశారు. కార్యాలయ కొలతల కార్యక్రమానికి వైఎస్సార్‌సిపి జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య (నాని) హాజరయ్యారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కొలతలు వేస్తున్నామని కమిషనర్ బాపిరాజు మీడియాకు తెలిపారు. అయితే హైకోర్టు పూర్తి ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయో మాత్రం ఆయన దాటవేశారు. కార్యాలయ బయటి కొలతలను సిబ్బంది తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఏసిపి హరి ప్రసాద్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పలువురు వైఎస్సార్‌సిపి కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.