ప్రతి ఒక్కరూ కార్గో సేవలను వినియోగించుకోవాలని డిపో మేనేజర్ వెల్లడి.
మచిలీపట్నం :
మచిలీపట్నం డిపో నుండి కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాల సందర్భంగా, సిబ్బంది ఉద్యోగులు కార్గో సేవలు విస్తృత ప్రచారమాధ్యమంగా మచిలీపట్నం నగర వీధులలో మంగళవారం రోడ్డు పై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్గో ద్వారా 2018 -19 లో సగుటన రోజుకి 6000 – 7000 రూపాయల చొప్పున వచ్చే ఆదాయం ప్రస్తుతము 50 వేల నుంచి 60 వేల రూపాయల వరకు పెరిగింది. ప్రజలకు అతి చేరువుగా ఉండటానికి డోర్ డెలివరీ సౌకర్యాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసం 2025 డిసెంబర్ 20వ తేదీ నుండి 2026 జనవరి 19 వరకు డోర్ డెలివరీ మాసోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ మచిలీపట్నం డిపో మేనేజర్ పెద్దిరాజులు పేర్కొన్నారు. ఈ నెల రోజులపాటు ఉద్యోగులందరూ సమిష్టిగా డోర్ డెలివరీ ప్రచారాన్ని ఇంటింటికి నగర నగరానికి తీసుకువెళ్లి మొత్తం మన రాష్ట్రంలో 84 పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆర్టీసీకి స్వల్ప ఖర్చుతో 24 గంటల్లోపు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎలా ఇచ్చిన సరుకుని అలా భద్రంగా అప్పజెప్పేందుకు అన్ని రకాలుగా చర్యలు ఏపడుతున్నామని పెద్దిరాజుల వివరించారు. కావున మచిలీపట్నం నగరవాసులందరూ ఈ కార్గో రవాణా సౌకర్యాన్ని డోర్ డెలివరీ రూపంలో వినియోగించుకోగలరని కృష్ణాజిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.