మహిళలు ఆర్ధికంగా, సామాజికంగా వృద్ధి సాధించిన రోజు నిజమైన సాధికారిత వచ్చినట్లు అని హ్యుమానిటీ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు నూర్జహాన్ బేగం అన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఎన్ ఎస్ ఎస్ యూనిట్ – 1 ఆధ్వర్యములో బందరు కోట లో నిర్వహిస్తున్న శిబిరం ఐదవ రోజు కు చేరుకుంది. మంగళవారం ఉదయం మహిళా సాధికారిత సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న నూర్జహాన్ బేగం మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల లో పొదుపు చేయడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆర్ధిక స్వావలంబన సాధించేలా మహిళలు ముందడుగు వేయాలన్నారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించేందుకు కష్టించాలన్నారు. తదుపరి మధ్యాహ్నం బ్యాంకింగ్ రంగం పై విశాఖ కో ఆపరేటివ్ బ్యాంక్ వారి ఆధ్వర్యములో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ అధికారిణి డా. సల్మా, విద్యార్ధులు పాల్గొన్నారు.