ప్రజల నుండి అందే అర్జీలను ప్రత్యేక శ్రద్ధతో సానుకూలంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ సమావేశం మందిరంలో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, కేఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, మెప్మా పీడీ సాయిబాబు, డిఎస్పి శ్రీనివాసరావులతో కలసి సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను జిల్లా కలెక్టర్ ఎంతో ఓపికగా ఆలకించి సంబంధిత అధికారులను పిలిపించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా మొత్తం 132 అర్జీలను ప్రజల నుండి జిల్లా యంత్రాంగం స్వీకరించింది. కృత్తివెన్ను మండలం మట్లం గ్రామానికి చెందిన బర్రి ధనుంజయ్ తనకు 15 సంవత్సరాల వయస్సు అని, 90 శాతం వికలత్వం ఉందని ప్రభుత్వ వైద్యులు ధృవీకరించారని పింఛను మంజూరు చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు. జిల్లా కలెక్టర్ మానవత్వంతో ఒక చక్రాల కుర్చీని వెంటనే తెప్పించి అందులో అతనిని కూర్చునే ఏర్పాటు చేశారు. బంటుమిల్లి మండలం అత్తమూరు గ్రామానికి చెందిన దివ్యాంగురాలు బీమవరపు చిట్టెమ్మ తనకు పింఛను మంజూరు చేయాలని కోరుతూ అర్జీ జిల్లా కలెక్టర్కు అందజేశారు. ముఖ్యంగా దివ్యాంగుల సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డి ఆర్ డి ఎ పి డి హరిహరనాదుకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ సోమశేఖర్, డిఆర్ డి ఎ పిడి హరిహర నాథ్, జెడ్పిసిఈఓ కే కన్నమ నాయుడు, ఆర్ అండ్ బి ఈ ఈ లోకేష్, డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ యుగంధర్, డిఎస్ఓ మోహన్ బాబు, జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, జిల్లా ఉద్యాన అధికారి జే జ్యోతి , ఐ సి డి ఎస్. పి డి ఎం ఎన్ రాణి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.