చీఫ్ సెక్రటరీ ఉత్తర్వుల ప్రకారం స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనం నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపమని కోరగా, సదరు భవనం నిర్మాణం కోసం చీఫ్ సెక్రటరీ కి ప్రతిపాదనలు పంపటం జరిగిందని మచిలీపట్నం నగర కార్పొరేషన్ కమిషనర్ సిహెచ్ వివిఎస్ బాపిరాజు తెలిపారు.
పట్టాభి స్మారక భవనం నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని కొలతలు వేసేందుకు గాను ఆ స్థలాన్ని ఆదివారం మచిలీపట్నం కమిషనర్, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్
పి. వి. ఫణి కుమార్ లు పరిశీలించి ఆ స్థలంలో ఉన్న పిచ్చి మొక్కలను మున్సిపల్ జెసిబి తో తొలగించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టాభి సీతారామయ్య స్మారక భవనం కోసం చీఫ్ సెక్రటరీ ప్రతిపాదనలు పంపమన్నారని, అందులో భాగంగా ఆ స్థలానికి కొలతలు వేసి ప్లాను వగైరాలు చీఫ్ సెక్రటరీ కి పంపటం జరిగిందని అన్నారు.
భవనం నిర్మాణ విషయమై చీఫ్ సెక్రటరీ ఈనెల 7వ తేదీన సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారని బాపిరాజు తెలిపారు.