కృష్ణా విశ్వవిద్యాలయం ఎన్ ఎస్ ఎస్ యూనిట్ – 1 విభాగం ఆధ్వర్యములో బందరు కోట లో నిర్వహిస్తున్న సేవా శిబిరం రెండో రోజుకు చేరింది. శనివారం గ్రామం లో మొక్కలు నాటడం తో పాటు విద్య యొక్క అవశ్యకతను తెలియచేస్తూ అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. సావిత్రి భాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతర చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సీళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ అధికారిణి డా సల్మా, విద్యార్ధులు పాల్గొన్నారు.