మచిలీపట్నం :
విద్యార్థి దశ నుంచే రహదారి భద్రత నియమాలపై అవగాహన పెంచుకోవాల్సిన బాధ్యత ప్రతియొక్క విద్యార్థిపై ఉందని బందరు ట్రాఫిక్ ఎస్సై బాలాజీ అన్నారు.
శుక్రవారం నారాయణ టెక్నో స్కూల్ విద్యార్థులకు రహదారి భద్రతా నియమాలపై అవగాహన నిర్వహించారు.
రహదారి నియమ నిభందనలు పాటించకపోవడం వాహన చోదకులతో పాటూ ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదమన్నారు. రహదారి నియమాలను ప్రతిఒక్కరు పాటించడం ద్వారా ప్రమాదాల సంఖ్యను తగ్గించగలమని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లలకు వాహనాలను ఇస్తే తల్లిదండులపై కేసులు నమోదు చేస్తామన్నారు, అలాగే హెల్మెట్‌ను, సీట్ బెల్టును ధరించి మాత్రమే వాహనాలు నడపాలన్నారు. రాష్ , నిర్లక్ష్యపు డ్రైవింగ్ వలన ఎందరో యువకులు తమ శరీర భాగాలను ప్రాణాలను పోగొట్టుకుని వారి తల్లిదండ్రుల జీవితాల్లో చీకట్లను నింపారని తెలిపారు.
ట్రిపుల్ డ్రైవింగ్ చేయరాదని, ద్విచక్ర వాహనం కేవలం ఇరువురు మాత్రమే ప్రయాణించడానికి రూపొందించబడింది, కానీ కొందరు ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తూ అదుపు తప్పి ప్రాణాలను కోల్పోతున్నారని తెలిపారు. పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి విద్యార్థి డ్రైవింగ్ లైసెన్స్ ను తప్పక పొందాలని, రహదారి నియమాలను పాటిస్తూ రహదారి ప్రమాదరహిత దేశాన్ని నిర్మించడం భావితరంపై ఆధారపడి ఉందని అన్నారు.
విద్యార్థులు కూడా రహదారులపై నిర్లక్ష్యముగా వాహనాలను నడపడం శోచనీయమన్నారు. ప్రతి పౌరుడు తమ హక్కులతో పాటుగా తమ విధులను, రహదారి నియమాలను పాటించిన నాడే ఆరోగ్యకరమైన సమాజాన్ని చూడగలమని అన్నారు.
ఈ కార్యక్రమంలో నారాయణ టెక్నో స్కూల్ యాజమాన్యం , ట్రాఫిక్ సిబ్బంది కూడా పాల్గొన్నారు