కృష్ణా విశ్వవిద్యాలయం ఎన్ ఎస్ ఎస్ యూనిట్ – 1 ఆధ్వర్యములో ప్రత్యేక సేవా శిబిరం ప్రారంభించారు. శుక్రవారం బందరు కోట ఎస్టీ కాలనీ లో ఏర్పాటు చేసిన శిబిరాన్ని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, డివిజన్ ఇంచార్జి అనిల్ కుమార్ లు ప్రారంభించారు. తొలి రోజు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా విద్య అవశ్యకత, ఆరోగ్య సంరక్షణ, బాల్యవివాహాల నియంత్రణ పై అవశ్యకత తెలియచేస్తూ సర్వే చేపట్టారు. ఎస్టీ కాలనీ లో నిరుపేదలకు ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. ఏడు రోజుల పాటు పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ అధికారిణి డా. సల్మా తెలిపారు. ఈ కార్యక్రమం లో డా. శేషా రెడ్డి, శ్రీకాంత్, పెద్ద సంఖ్యలో విద్యార్ధులు పాల్గొన్నారు.