కృష్ణాజిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు శుక్రవారం మచిలీపట్నం పార్క్‌లోని ఎంపిఎల్ హైస్కూల్‌ను సందర్శించారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలును పరిశీలించారు. పదవ తరగతి విద్యార్థుల అభ్యాస ఫలితాలు, ధృవీకరించబడిన మూల్యాంకన పుస్తకాలు, నోట్ దిద్దుబాట్లు ఇతర విద్యా రికార్డులను సమీక్షించారు. ఆయన కాసేపు విద్యార్థులతో సంభాషించారు, మధ్యాహ్న భోజనం (ఎండిఎం)ను పరిశీలించి, తిని రుచి చూశారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయడానికి స్పష్టమైన సూచనలను ఉపాధ్యాయులకు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఈఓ శేఖర్ సింగ్, మున్సిపల్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
69వ జాతీయ స్కూల్స్ గేమ్స్ పై సమావేశం నిర్వహించిన డీఈవో69వ జాతీయ స్కూల్ గేమ్స్ (U-14) అండర్ 14 బాలికల కబడ్డీ టోర్నమెంట్‌కు సంబంధించి రాష్ట్ర స్కూల్ గేమ్స్ కార్యదర్శి భాను మూర్తి రాజుతో కలిసి జిల్లాలో ఉన్న ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, పిడీలు, పిఈటి లతో కలిసి శుక్రవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. దీనిలో జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు పాల్గొన్నారు . ఈ సందర్భంగా జిల్లాలో నిర్వహించే కబడ్డీ టోర్నమెంట్ కు సంబంధించిన వివరాలు తెలియజేశారు. అండర్ 14 బాలికల కబాడీ టోర్నమెంట్ నిర్వహణపై పిడీలకు పిఈటిలకు దిశా నిర్దేశం చేశారు.