కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠ ద్వారంగుండా ప్రవేశించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు.దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన పిమ్మట మంత్రి రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ ముందుగా రాష్ట్ర ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.తిరుమలలో ఫల పుష్ప ప్రదర్శనతో స్వామివారి నమూనా ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుందన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను చక్క దిద్దుతూ ఈ ఏడాది ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ దర్శనం కల్పించడం శుభ పరిణామం అన్నారు.