మచిలీపట్నం :
మచిలీపట్నం మంగళవారం అవనిగడ్డ ప్రాంతంకు చెందిన ఓ దివ్యంగురాలు గత కొన్ని రోజుల క్రితం బ్యాటరీ బండి కోసం దరఖాస్తు చేసుకోంది. తన గ్రామం కు చెందిన వ్యక్తి బ్యాటరీ బండి ఇప్పిస్తానని కొన్ని రోజులుగా తిప్పుకున్నాడు. అలసిపోయిన ఆ దివ్యాంగ మహిళ వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి కామరాజును మంగళవారం తన కార్యాలయంలో కలిసి పరిస్థితిని వివరించింది. ఆ దివ్యాంగ మహిళలు చూసి వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి కామరాజు బ్యాటరీ సైకిల్ మంజూరు చేశారు. దీనితో ఆ మహిళ ఆనందానికి హద్దులు లేవు తనకు బ్యాటరీ బండి ఇచ్చిన అధికారికి ధన్యవాదాలు తెలిపి హర్షం వ్యక్తం చేసింది.
మచిలీపట్నం వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి ఈ సందర్భంగా కృష్ణాజిల్లా దివ్యాంగులకు ఒక విజ్ఞప్తి చేశారు. దివ్యాంగులు మధ్య వ్యక్తులను నమ్మి మోసపోవద్దని దివ్యాంగులకు అవసరమైన పరికరాలను కృష్ణాజిల్లా వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కార్యాలయం కు రాలేని పరిస్థితులలో ఫోన్ ద్వారా సంప్రదించాలని కోరారు.