మచిలీపట్నం :
మచిలీపట్నం ఉల్లింగి పాలెం లో మేళ తాళాలతో సాంప్రదాయపద్దతిలో ఆంబోతు కు అంతిమయాత్ర నిర్వహించిన గో ప్రేమికులు. గత మూడు సంవత్సరాల క్రితం కోనేరు సెంటర్ వద్ద ఆంబోతు కాలి పై నుంచి లారి వెళ్లడంతో ఆంబోతుకు కాలిపై తీవ్ర గాయం అయింది. చికిత్స నిమిత్తం ఆంబోతును గన్నవరం పశువైద్య శాలకు తరలించి వైద్యులత చికిత్స అందించారు స్థానికులు. అప్పటి నుండి గో ప్రేమికుడు కొల్లు హరి పర్యవేక్షణలో ఉన్న గోవు గత రెండు రోజుల నుంచి పూర్తి అనారోగ్యం పాలై బుధవారం మృతి చెందింది.
హిందూ సాంప్రదాయం ప్రకారం ఆంబోతు కి మేళతాళాలతో నగరంలో ఊరేగింపుగా అంతిమయాత్ర నిర్వహించిన గో ప్రేమికులు హిందూ సాంప్రదాయ సంస్కృతిని కాపాడే ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలని విజ్ఞప్తి చేసిన గో ప్రేమికులు