మచిలీపట్నం :
జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ వి .విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు సోమవారం ఏఆర్ అడిషనల్ ఎస్పి బి.సత్యనారాయణ మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలు మూలల నుండి వచ్చిన, ఫిర్యాదుదారులవద్ద నుండి అర్జీలు అందుకుని, వాటిని సకాలంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మెత్తం 45 అర్జీలు స్వీకరించగా స్వీకరించిన అన్ని ఫిర్యాదులను సంబంధిత పోలీసు అధికారులకు పరిష్కారం నిమిత్తం పంపించారు…. అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ.
మీకోసం లో వచ్చిన ఫిర్యాదుల వివరాలు…
యనమలకుదురు నుండి ఒక మహిళ వచ్చి తన భర్త 2014 లో మరణించాడని, అప్పటి నుండి అత్తవారింటి వద్ద ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నామని, భర్త లేడనే నెపంతోఆడపడుచు, ఆమె భర్త, అత్తింటి వారు, అనేక రకాలుగా హింసించడం చేస్తున్నారని, 2013, ఏప్రియల్ నెలలో తన అత్తగారు కూడా కాలం చేయగా వీరి ఆగడాలకు అడ్డు అదుపూ లేదని, పిల్లలతో సహా ఇంటినుండి గెంటి వేసారని , న్యాయం చేయమని ఫిర్యాదు.
మచిలీపట్నం నుండి ఒక మహిళ వచ్చి తనకు చల్లపల్లి మండలం కు చెందిన వ్యక్తితో వివాహం జరిగిందని, కొంతకాలం కాపురం సజావుగానే సాగిందని, ఆడపిల్ల పుట్టిందనే కారణం గా రెండు సంవత్సరాలా నుండి పుట్టింటి వద్దే ఉంటూ మానసికంగా అనేక ఇబ్బందులు పడుతున్నానని, న్యాయం చేయమని ఫిర్యాదు.
బంటుమిల్లి కి చెందిన ఒక వ్యక్తి వచ్చి తాను నివాసం ఉంటున్న ఇంటి పక్క సరిహద్దు దారుడు అతని కుమారుడు కలసి పాత సరిహద్దు గొడవల నేపథ్యంలో, అనేక ఇబ్బందులకు గురి చేస్తూ, దాడులకు దిగుతూ, చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని, రక్షణ కల్పించి న్యాయం చేయమని ఫిర్యాదు.
కానూరుకు చెందిన ఒక మహిళ వచ్చి తన భర్త మరణించాడని, కుటుంబ పోషణ నిమిత్తం ఆటో కన్సల్టెన్సీ వ్యాపారం నిర్వహిస్తున్నానని, అందు నిమిత్తం ముగ్గురి దగ్గర నగదు అప్పుగా తీసుకోగా, వారు అధిక వడ్డి వసూలు చేయడమే కాకుండా దుర్భాషలాడుతూ అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని, రక్షణ కల్పించమని ఫిర్యాదు.