ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ 2025 రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన బాడీ బిల్డింగ్ పోటీలలో బందరు యువకుడు మొదటి స్థానంలో నిలిచి స్వర్ణ పథకం సాధించాడు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా పలాస లో నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీలలో ఈ ఘనత సాధించాడు.
మచిలీపట్నం మాచవరం కు చెందిన బీరం ప్రశాంత్ బాడీ బిల్డింగ్ పోటీలలో స్వర్ణ పథకం సాధించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ గతంలో అనేక బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొని రాష్ట్రస్థాయి పథకాలను సాధించాడు.
న్యూ నవ్యాంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బాడీ బిల్డింగ్ కార్యక్రమంలో బీరం ప్రశాంత్ 65 కేజీల విభాగంలో మొదటి స్థానం సాధించి బంగారు పథకం కైవసం చేసుకున్నాడు. న్యూ నవ్యాంధ్ర ఫిట్నెస్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుబ్రమణ్యం, జనరల్ సెక్రెటరీ శ్రీనివాసరావు చేతుల మీదుగా గోల్డ్ మెడల్, సర్టిఫికెట్ ను అందుకున్నారు.