MachilipatnamLocal News
February 28, 2026
కృష్ణా జిల్లా

బిల్ గేట్స్ కు గుర్రపు డెక్క తో వస్తువుల తయారీ వివరించిన జిల్లా కలెక్టర్

  • February 16, 2026
  • 0 min read
[addtoany]
బిల్ గేట్స్ కు గుర్రపు డెక్క తో వస్తువుల తయారీ వివరించిన జిల్లా కలెక్టర్
మచిలీపట్నం :
 
           కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కే. బాలాజీ బిల్ గేట్స్ కు గుర్రపు డెక్క (వాటర్ హ్యాసింత్) నారతో తయారుచేసిన హస్తకళా బుట్ట సంప్రదాయ కలంకారి శాలువాతో ఆత్మీయంగా స్వాగతం పలికి సత్కరించారు. గుర్రపు డెక్క నారతో తయారుచేసిన బుట్టను పరిశీలించిన వెంటనే బిల్ గేట్స్ ఆసక్తి వ్యక్తం చేస్తూ, దాని తయారీ విధానం, ఉత్పత్తి నేపథ్యం గురించి కలెక్టర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
 
             దీనికి ప్రతిగా కలెక్టర్ స్పందిస్తూ, కృష్ణా జిల్లాలో గుర్రపు డెక్క (వాటర్ హ్యాసింత్) విరివిగా లభిస్తుందని, ఆ సహజ వనరును సమర్థవంతంగా వినియోగిస్తూ స్వయం సహాయక సంఘాల (ఎస్ హెచ్ జి) మహిళలకు హస్తకళా ఉత్పత్తులు (హ్యాండీక్రాఫ్ట్) తయారీలో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ఈ శిక్షణ ద్వారా వివిధ రకాల పర్యావరణ హిత కళాకృతులను తయారు చేయిస్తున్నామని వివరించారు. 
 
         మచిలీపట్నం మండలం చిన్నాపురం గ్రామంలో డ్వాక్రా మహిళలతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి, వారి ద్వారా ఈ హస్తకళా ఉత్పత్తులను (హ్యాండీక్రాఫ్ట్స్) తయారు చేయించి, లేపాక్షి, టీటీడీ (టీటీడీ) ఇతర సంస్థలకు ఆర్డర్లు అందిస్తూ మహిళలకు స్థిరమైన జీవనోపాధి కల్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా, ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, మరింత మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. 
 
         గుర్రపు డెక్క నారతో తయారుచేసిన హ్యాండీక్రాఫ్ట్స్ పై బిల్ గేట్స్ ఆసక్తి చూపడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ పరిణామం ద్వారా కృష్ణా జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *