మచిలీపట్నం :
మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి సహాయంతో ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి విడుదలైన మొత్తం ₹2,96,888 ఆర్థిక సాయాన్ని అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే భావనతో, అవసరమైన ప్రతి కుటుంబానికి వైద్య సహాయం అందేలా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఈ సాయం అందించారు.
సహాయం అందించిన లబ్ధిదారుల వివరాలు పెడన నియోజకవర్గం, కోకా నారాయణ పాలెం, గూడూరు గ్రామానికి చెందిన బేబీ ఆఫ్ పగడాల నాగిని (చైల్డ్) కు – ₹2,47,904, బంటుమిల్లి గ్రామానికి చెందిన డక్కుమళ్ల అభిలాష్ కు – ₹48,984 రూపాయలు అందించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ఆపదలో ఉన్న ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం వారికి కొంతమేర ఊరటనిస్తుందని తెలిపారు. *ఆరోగ్యమే మహాభాగ్యం* అనే సిద్ధాంతంతో ప్రతి అర్హుడికి సహాయం అందేలా తాను ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నానని చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య, ఆర్థిక సమస్యలను గుర్తించి, వారికి త్వరితగతిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు.