శక్తి టీం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పోక్సో చట్టం, మత్తు పదార్థాల నివారణ, ర్యాగింగ్, సోషల్ మీడియా నేరాలు గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్ సుశీల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సుశీల మాట్లాడుతూ విద్యార్థులకు మత్తు పదార్థాలను అలవాటు చేసి వారిని మానవ అక్రమ రవాణా చేస్తున్నారని విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయకూడదు అని, ఫోక్సో చట్టం గురించి అవగాహన కలిగి ఉండాలని, అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్లు 112, 181, 1098, 1930 తెలిపారు. ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులను ఉద్దేశించి రాబోవు పబ్లిక్ ఎగ్జామ్స్ ను ఏ విధంగా రాయాలి అని అవగాహన కల్పిస్తూ, ఉన్నత చదువుల కొరకు కళాశాలకు వెళ్ళినప్పుడు అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తూ అక్కడ ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్లు ద్వారా పోలీసులకు సమాచారం తెలియజేయాలని సూచించినారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ , అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.