అంధత్వాన్ని జయించి గ్రూప్ – 2 పరీక్షల్లో విజేతగా నిలిచి ఏపీపీఎస్సీ హెచ్ ఓ డి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం సాధించిన చల్లపల్లి మండలం లక్ష్మీపురం శివారు సాలిపేటకు చెందిన నందం నాగరాజును కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే.బాలాజీ బుధవారం సన్మానించారు.
గ్రూప్ 2 విజేతగా నిలిచి ఉద్యోగం సాధించటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ నాగరాజును అభినందించారు. కంటిచూపు కోల్పోయిన నాగరాజు విద్యాభ్యాసం ఎలా సాగించారో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, నాగరాజు తల్లి వెంటేశ్వరమ్మ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.