MachilipatnamLocal News
June 26, 2026
మచిలీపట్నం

ఆదివారం జగన్నాథస్వామి, మల్లేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవములు

  • June 26, 2026
  • 0 min read
[addtoany]
ఆదివారం జగన్నాథస్వామి, మల్లేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవములు

మచిలీపట్నం:

జూన్ 27, శనివారం నుంచి జులై 01 బుధవారం వరకు జగన్నాథపురంలో సుమారు 600 సంవత్సరాల నుంచి వేంచేసియున్న శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ జగన్నాథస్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడునని ఆలయ చైర్ పర్సన్ గంపల దుర్గ భవాని, కార్యనిర్వహణాధికారి కొండవేటి మురళీకృష్ణ తెలిపారు. కళ్యాణ మహోత్సవంలో భాగంగా జూన్ 28, ఆదివారం సాయంత్రం 7గంటలకు దివ్య తిరుకళ్యాణము నిర్వహించబడునని తెలిపారు.

జూన్ 27, శనివారం నుండి జూన్ 30 మంగళవారం వరకు సర్కిల్ పేటలో వేంచేసియున్న శ్రీ భ్రమరాంబ సామెత మల్లేశ్వరస్వామి వారి వార్షిక దివ్య కల్యాణ మహోత్సవము నిర్వహించబడునని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ యక్కల చంద్రశేఖర్, కార్యనిర్వహణాధికారి కొండవేటి మురళీకృష్ణ తెలిపారు. కళ్యాణ మహోత్సవంలో భాగంగా జూన్ 28, ఆదివారం సాయంత్రం 7గంటలకు స్వామి వారికి కళ్యాణం నిర్వహించబడునని తెలిపారు.

About Author

SSN