MachilipatnamLocal News
September 5, 2026
మచిలీపట్నం

ఇద్దరు వృద్ధులకు ఆశ్రయం కల్పించిన హెల్పింగ్ హాండ్స్

  • May 9, 2026
  • 0 min read
ఇద్దరు వృద్ధులకు ఆశ్రయం కల్పించిన హెల్పింగ్ హాండ్స్

మచిలీపట్నం :

ఇద్దరు బిడ్డలు భార్య ఉండి ఒక పూట భోజనం పెట్టేవారు లేక నిలువ నీడ లేక విజయవాడ ఫుట్పాత్ మీద ఉంటున్న కడపకు చెందిన కానాసి పెద్ద రంగయ్య (72) కర్ణాటక రాష్ట్రం దావనగిరి కి చెందిన నాయక రవికిరణ్ (56) విజయవాడ హోటల్లో పని చేసుకుంటూ జీవిస్తున్నారు. రోడ్డు ప్రమాదం వల్ల కన్ను పూర్తిగా కనబడక రవి కిరణ్ పని కోల్పోయాడు. అప్పటినుండి నిలువ నీడ లేక తినడానికి లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇది గమనించిన హెల్పింగ్ హాండ్స్ వెంకట్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చందన వెంకట్ వారికి వైద్యం చేయించి మచిలీపట్నం మండలం మేకవానిపాలెంలో తమ ఆశ్రమంలో ఉచిత ఆశ్రయం కల్పించారు. ఇలా ఇబ్బంది పడే వృద్ధుల ఆశ్రయం అవసరం అయితే 9949926465 కు సంప్రదించాలని హెల్పింగ్ హాండ్స్ ట్రస్ట్ ఫౌండర్ చందన వెంకట్ కోరారు. సాయం అందించడంలో తాము ముందు ఉంటామని, ఎవరికీ ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తామని తెలిపారు.

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *