MachilipatnamLocal News
February 28, 2026
పోలీస్ డైరీ

ప్రతి విద్యార్థి తనకు గల రక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి – సీఐ ఆర్ పేట

  • February 20, 2026
  • 0 min read
[addtoany]
ప్రతి విద్యార్థి తనకు గల రక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి – సీఐ ఆర్ పేట
మచిలీపట్నం :
 
       సమాజంలో మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాల గురించి, వాటి నుంచి తాము ఎలా రక్షించుకోవాలో ప్రతి విద్యార్థిని తప్పక తెలుసుకోవాలని శుక్రవారం స్థానిక బాలాజీ విద్యలయం నందు జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు ఆర్ పేట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఏసుబాబు పోక్సో ఇతర రకాలైన చట్టాల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 
 
        విద్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రతి విద్యార్థి తనకు గల రక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఆర్ పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏసుబాబు అన్నారు. పోలీస్ రక్షణ చట్టాలు, ఏదైనా నేరాల బారిన పడితే పోలీసు వారి నుండి రక్షణ ఏ విధంగా పొందాలి, బాల్యవివాహాల కారణంగా ఎదురయ్యే దుష్పరిణామాలు, సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో అనుసరించాల్సిన చర్యలు, ఆత్మరక్షణకు నేర్చుకోవాల్సిన ప్రాథమిక పద్ధతులపై విద్యార్దులకు విపులంగా వివరించారు. ఆత్మ రక్షణ చర్యల్లో భాగంగా సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులను తప్పకుండా నేర్చుకోవాలని, ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింక్‌లకు స్పందించవద్దని సూచించారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *