MachilipatnamLocal News
May 24, 2026
కృష్ణా జిల్లా

సిఎస్ఆర్ ఫండ్ తో కమ్యూనిటీ హాళ్లు నిర్మాణం

  • January 31, 2026
  • 0 min read
[addtoany]
సిఎస్ఆర్ ఫండ్ తో కమ్యూనిటీ హాళ్లు నిర్మాణం
మచిలీపట్నం :
 
బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి విశేష కృషితో మచిలీపట్టణం పార్లమెంట్ నియోజకవర్గ చరిత్రలో తొలిసారిగా సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా 9.63 కోట్ల సి ఎస్ ఆర్ నిధులతో 16 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపట్టనున్నారు.
 
ఇప్పటికే 11 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి అని, మిగిలిన 5 హాళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి అని తెలిపారు. వివాహాలు, సామాజిక కార్యక్రమాలు, సమావేశాలు వంటి అవసరాల కోసం సామాన్యులకు అందుబాటులో ఉండే రీతిలో, సామాన్య ప్రజలు వినియోగించుకునేలా ఈ కమ్యూనిటీ హాళ్లు రూపుదిద్దుకుంటున్నాయి అని ఎంపీ కార్యాలయం ప్రకటనలో తెలిపారు. 
 
సి ఎస్ ఆర్ నిధులను సమర్థవంతంగా సమీకరించి,
ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని
ఈ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు చేపట్టబడుతున్నాయి అని కార్యాలయం స్పష్టం చేసింది.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *