MachilipatnamLocal News
July 21, 2026
ఫీచర్స్

అపూర్వ సహోదరులకు ప్రశంసా పత్రం

  • January 27, 2026
  • 0 min read
[addtoany]
అపూర్వ సహోదరులకు ప్రశంసా పత్రం
మచిలీపట్నం :
 
        ఒకరు హనుమాన్ జంక్షన్ ఎస్సై వి. సురేష్, మరొకరు పామర్రు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి . సుభాకర్ వీరిద్దరూ స్వయాన అన్నదమ్ములు. అన్నదమ్ముల్లో పెద్దవాడైన సీఐ సుభాకర్ 2009 బ్యాచ్ లో ఎస్సై గా సెలెక్ట్ అయి తూర్పుగోదావరి జిల్లా కడియం లో మొదటి పోస్టింగ్ తీసుకున్నారు. ప్రమోషన్ పై కృష్ణ జిల్లా స్పెషల్ బ్రాంచ్ సిఐ గా చేసి ప్రస్తుతం పామర్రు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. 
 
       ఆయన తమ్ముడైన హనుమాన్ జంక్షన్ ఎస్సై వి సురేష్ 2012 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ గా తూర్పుగోదావరి జిల్లాలోని గండేపల్లి మొదటి పోస్టింగు తీసుకున్నారు .ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ఏడాది(2026) గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అన్నదమ్ములు ఒకే వేదిక మీద ఉత్తమ సేవా పురస్కారాలు అందుకోవడం విశేషం .వీరిద్దరూ కలిసి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ,జిల్లా కలెక్టర్ బాలాజీ చేతుల మీదుగా అన్నదమ్ములు ఇద్దరూ కలిసి గణతంత్ర పురస్కారం అందుకోవడం విశేషం .
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *