కొల్లేరు పరిరక్షణపై వీడియో కాన్ఫరెన్స్
మచిలీపట్నం :
ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ డాక్టర్ పి. కృష్ణయ్య మంగళవారం సాయంత్రం విజయవాడ నుంచి కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాకారులతో కొల్లేరు సరస్సు పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో నగరంలోని తన క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొన్నారు.కొల్లేరు సరస్సు పరిరక్షణలో భాగంగా కాలుష్యాన్ని అరికట్టడం, నీటి నాణ్యతను మెరుగుపరచడం, సిల్టేషన్ నివారణ, జీవవైవిధ్యాన్ని కాపాడడం వంటి అంశాలపై ఛైర్మన్ చర్చించారు.కలెక్టర్ తో పాటు వీడియోకాన్ఫరెన్స్ లో కైకలూరు వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కేవీ రామ లింగాచార్యులు, గుడివాడ డి ఎల్ పి ఓ జి సంపత్ కుమారి పాల్గొన్నారు.


