చిన్న ఆకులమన్నాడు శ్రీ అభయ కోదండరామ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ధనుర్మాస ఉత్సవముల సందర్భంగా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని, ఆలయ పాలకవర్గం , గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మహిళలచే ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన చిన్నారులు, యువతులు పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా రంగురంగుల ముగ్గులు వేసి ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించారు. సంక్రాంతి సంప్రదాయాలు, గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా రూపొందించిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఇలాంటి సాంప్రదాయ కార్యక్రమాలు గ్రామీణ సంస్కృతి పరిరక్షణకు ఎంతో దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమం ముగింపులో ముగ్గుల పోటీలలో పాల్గొన్న జూనియర్ విభాగం సీనియర్ విభాగం మహిళలకు వేర్వేరుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడినందుకు పాల్గొన్న మహిళలకు, సహకరించిన గ్రామ ప్రజలకు ఆలయ పాలకవర్గం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.