హ్యుమానిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో….భారతదేశ తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షైక్ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.. 8 వ డివిజన్ అరునోదయ కాలనీ లోని మసీద్ వద్ద జయంతి వేడుకలు జరిగాయి. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాలనీలోని ముస్లిం మహిళలకు విద్య కోసం ఫాతిమా చేసిన పోరాటాలగూర్చి మహిళలకు వివరించారు. ఫాతిమాను ఆదర్శంగా తీస్కుని మహిళలు ఉన్నత స్థితికి ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షురాలు నూర్జహాన్, సెక్రటరీ అజ్మతున్నిసా, సభ్యులు కృష్ణా విశ్వ విద్యాలయ ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్ డాక్టర్ సల్మా, సయ్యద్ జావేద్, ఎం.సతీష్, నాజీయా, సయ్యద్ సల్మా తదితరులు పాల్గొన్నారు.