MachilipatnamLocal News
January 14, 2026
కృష్ణా జిల్లా

మున్సిపల్ కమిషనర్లతో జిల్లా స్థాయి జాతీయ హరిత ట్రిబ్యునల్ పర్యవేక్షణ సమావేశం

  • January 8, 2026
  • 0 min read
[addtoany]
మున్సిపల్ కమిషనర్లతో జిల్లా స్థాయి జాతీయ హరిత ట్రిబ్యునల్ పర్యవేక్షణ సమావేశం
మచిలీపట్నం 
 
పట్టణ ప్రాంతాల్లో వ్యర్థపదార్థాలను ఎప్పటికప్పుడు తొలగించడంతోపాటు పారిశుధ్యం సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మునిసిపల్ అధికారులను ఆదేశించారు. 
 
గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ కమిషనర్లతో జిల్లా స్థాయి జాతీయ హరిత ట్రిబ్యునల్ పర్యవేక్షణ సమావేశం నిర్వహించి మున్సిపాలిటీ వారీగా సమీక్షించారు.
 
ప్రతిరోజు తెల్లవారుజామున పట్టణంలో పర్యటిస్తూ పారిశుధ్య ఏర్పాట్లు గమనిస్తున్నారా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు 
క్షేత్రస్థాయిలో తడి చెత్త, పొడి చెత్త వేరు చేస్తున్నారా లేదా వ్యర్థాలతో కాంపోస్టు ఎరువు తయారు చేస్తున్నారా లేదా అని విచారించారు
 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ హరిత ట్రిబునల్ ఆదేశాల మేరకు ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని అన్ని పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థ పదార్థాలను సజావుగా నిర్వహించాలన్నారు. 
వాయు కాలుష్యం లేకుండా ఎప్పటికప్పుడు చెత్త చెదరాలను తొలగించాలన్నారు. 
 
మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో మొదటి దశలో ఒప్పందం ప్రకారం 65,861 మెట్రిక్ టన్నుల లెగసి వ్యర్థాలకు గాను 61,107 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను వివిధ రకాలుగా వేరుపరిచే ప్రక్రియ పూర్తయిందని ప్రజారోగ్య శాఖ ఈ ఈ ప్రవీణ్ కలెక్టర్కు వివరించారు. 
 
 అలాగే గుడివాడ మున్సిపాలిటీలో 42,953 మెట్రిక్ టన్నుల వ్యర్థాలకు గాను 23,620 మెట్రిక్ టన్నులు వ్యర్థాలను వివిధ రకాలుగా వేరుపరిచే ప్రక్రియ పూర్తయిందన్నారు. పెడన, ఉయ్యూరు పట్టణాల్లో ఇంకా మొదలు కాలేదన్నారు. 
దీంతో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ
వచ్చే సమావేశానికి వెండార్లను కూడా పిలవాలని సూచిస్తూ వెంటనే ఆ వెండార్లతో మాట్లాడి పెడన ఉయ్యూరులలో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వ్యర్థాల నిర్వహణ ప్రక్రియ మొదలు పెట్టాలని ఆదేశించారు.
 
ఈ సమావేశంలో మచిలీపట్నం, గుడివాడ ఉయ్యూరు, తాడిగడప మున్సిపల్ కమిషనర్లు సిహెచ్ బాపిరాజు, మనోహర్, రామారావు, నజీర్ పలువురు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. 
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *