– ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్ధులు
మచిలీపట్నం:
కృష్ణా విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. విద్యార్ధులు పంచెలు, విద్యార్థినులు చీరలు ధరించి వేడుకల్లో పాల్గొనడం తో పండుగ శోభ ఉట్టిపడింది. ఈ సందర్భంగా రెక్టర్ ఆచార్య ఎంవి బసవేశ్వరరావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ను దేశం లోని పలు రాష్ట్రాల్లో పలు పేర్లతో ఉత్సాహంగా చేసుకుంటారన్నారు. కొత్త పంటను ఇంటికి తీసుకుని వచ్చే సందర్భమే సంక్రాంతి పండుగ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు వేసిన రంగవల్లులు అలరించాయి. అనంతరం సంక్రాంతి పాటలతో చేసిన నృత్యాలు ఉర్రూతలూగించాయి. ఈ కార్యక్రమంలో విభాగ అధిపతి డా. సుజాత, సహాయ ఆచార్యులు డా. అనిల్, డా.పుష్పలత, డా. హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.