కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. కోడలిపై మామ దాడి తీవ్ర కలకలం రేపింది. సేకరించిన వివరాల ప్రకారం మచిలీపట్నం పరాసుపేట కు చెందిన ఎన్జీవో నేత ఆకూరి శ్వేత వలంద పాలెం కు చెందిన వెంకన్న అనే వ్యక్తితో కొంతకాలం క్రితం వివాహం జరిగింది. ఇరువురి మధ్య కలహాలు రావడంతో కొంతకాలం నుండి భర్తకు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల వద్దనే ఉంటుంది. దీనితో భార్యాభర్తల మధ్యనే కాక ఇరువురు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయి. మామ సోమరాజు బుధవారం రాత్రి పరాసుపేట ఆంజనేయ స్వామి టెంపుల్ ఎదుట ఓ మెడికల్ షాప్ దగ్గర ఉన్న శ్వేతా పై కత్తితో హత్యాయత్నానికి ప్రయత్నించాడు. సోమరాజు తనతో పాటు తెచ్చుకున్న కత్తితో శ్వేత ను తుద ముట్టించేందుకు పన్నాగం తో కత్తితో తలపై దాడి చేశాడు. శ్వేత చెయ్యి అడ్డు పెట్టుకోవడంతో చెయ్యికు, తలపై బలమైన గాయాలయ్యాయి. సంఘటన స్థలంలో స్థానికులతో పాటు ఈగల్ డిపార్ట్మెంట్ కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ శ్వేతా మామ సోమరాజును అడ్డుకున్నారు. దీనితో స్థానికులు సోమరాజును పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు చెత్తగాత్రురాలను చికిత్స నిమిత్తం మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు గాయాలకు కుట్లు వేసి చికిత్స అందించారు. నిందితుడుపై మచిలీపట్నం చిలకలపూడి పోలీస్ స్టేషన్లో అత్యాయత్నం నేరంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.