MachilipatnamLocal News
January 14, 2026
కృష్ణా జిల్లా

గృహ నిర్మాణ పనులు వేగవంతం చెయ్యాలి….. డీకే బాలాజీ

  • January 8, 2026
  • 0 min read
[addtoany]
గృహ నిర్మాణ పనులు వేగవంతం చెయ్యాలి….. డీకే బాలాజీ
మచిలీపట్నం:
 
  జిల్లాలో గృహ నిర్మాణం పనులు వేగవంతం చేసి సకాలంలో లబ్బిదారులకు బిల్లులు చెల్లించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. 
 
గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో గృహ నిర్మాణం పురోగతిపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 24,133 గృహాలు నిర్మించాలన్నది లక్ష్యం కాగా ఇప్పటివరకు 103 గృహాలు మాత్రమే పూర్తి కావడం సరైంది కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 
 
అసలు సమస్య ఏమిటనీ ప్రశ్నించారు. పైకప్పు స్థాయి( ఆర్. ఎల్) లో 1,795 గృహాలు ఉండగా వాటిల్లో కేవలం 19 గృహాలు మాత్రమే రూఫ్ కాస్టింగ్ కు (ఆర్ సి) వచ్చాయన్నారు. కనీసం పై కప్పు స్థాయి నుండి రూప్ క్యాస్టింగ్ స్థాయి వరకు చేయలేక పోతే ఎలా అని ప్రశ్నించారు. ఈ సంవత్సరం మార్చి 31వ తేదీతో ఈ గృహ నిర్మాణ పథకం అంతం అవుతోందని, ఆలోపే అందరూ ప్రత్యేక శ్రద్ధ వహించి గృహ నిర్మాణాలు పూర్తి చేసి బిల్లులను సంబంధిత లబ్ధిదారులకు చెల్లించాలని ఆదేశించారు. 
 
లబ్ధిదారులకు బిల్లులు చెల్లించకపోతే అందుకు బాధ్యత సంబంధిత అధికారులే వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం పనుల కాలంలో పనులు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారని ప్రశ్నించారు.జిల్లాలో 1,015 ఇళ్ల నిర్మాణం ఇంకా మొదలుపెట్టలేదన్నారు. ఇప్పటికీ ఇళ్ల నిర్మాణం ప్రారంభించని వారికి ఆ ఇల్లు అవసరమా లేదా అనే ప్రశ్న తలెత్తుతుందన్నారు. వారికి వెంటనే నోటీసులు జారీ చేయాలన్నారు.
 
కేవలం రెండు, మూడు నెలలు మాత్రమే మిగిలాయని ఈ విషయం చాలా తీవ్రంగా పరిగణించి గృహ నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. సిమెంటు, ఇనుము తదితర గృహ నిర్మాణ సామాగ్రిలో ఏమైనా తేడాలు ఉన్న అవకతవకలకు పాల్పడిన బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 
 ఈ సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ అధికారి పోతురాజు, ప్రత్యేక అధికారులు జడ్పీ డిప్యూటీ సీఈఓ ఆనందకుమార్, డిఎస్ఓ మోహన్ బాబు, పర్యాటక అధికారి రామ లక్ష్మణ్, అగ్నిమాపక అధికారి ఏసురత్నం, ఉపాధి కల్పన అధికారి విక్టర్ బాబు, గృహ నిర్మాణ సంస్థ ఈఈ వెంకటరావు, డి ఎల్ డి ఓ పద్మ, ఎంపీడీవోలు పలువురు డి ఈ ఈ లు, ఏ ఈలు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *