కూటమి ప్రభుత్వం నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రహదారుల నిర్మాణం చేస్తోంది: మంత్రి జనార్దన్ రెడ్డి
SSN
- January 7, 2026
- 1 min read
[addtoany]
మచిలీపట్నం :
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే సంవత్సరం 3,380 కోట్ల రూపాయల వ్యయంతో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రహదారుల నిర్మాణము, మరమ్మతు పనులు చేపట్టామని రాష్ట్ర రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు,పెట్టుబడుల శాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు.
బుధవారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో రాష్ట్ర రహదారులు భవనాలు, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖ మంత్రివర్యులు, రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు లతో కలిసి బందరు ఓడరేవు, ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పనులు రహదారులు భవనాలశాఖ పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం పాత్రికేయల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. తద్వారా రాష్ట్రానికి పలు పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు రావడానికి మార్గం సుగమం చేశామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 1,081 కోట్ల రూపాయల వ్యయంతో 16వేల కిలోమీటర్ల మేరకు రహదారుల మరమ్మతులు, గుంతలు పూడ్చే కార్యక్రమం పూర్తి చేశామన్నారు.
రాష్ట్ర చరిత్రలో ఒకే సంవత్సరం 3,380 ఓట్ల రూపాయల వ్యయంతో రహదారుల నిర్మాణం చేపట్టామని, ఇందుకోసం టెండర్లు ఇప్పటికే పిలిచామని, మరికొన్ని ఒప్పందాలు జరుగుతున్నాయని, మరికొన్ని పనులు మొదలయ్యాయనీ చెబుతూ అన్ని కూడా నాణ్యతలో ఏమాత్రం లోటు లేకుండా వచ్చే మే నెల ఆఖరిలోగా పూర్తి చేస్తామన్నారు.
జిల్లాలో 160 కోట్ల రూపాయల వ్యయంతో 1,518 కిలోమీటర్ల మేరకు గుంతలు పడిన రహదారులను పూడ్చటంతో పాటు ఇతర మరమ్మతులను పూర్తి చేయడం జరిగిందన్నారు.
అందులో మచిలీపట్నం నియోజకవర్గంలో 33 కోట్ల రూపాయల వ్యయంతో 166 కిలోమీటర్ల రహదారుల మరమ్మతు పనులు చేపట్టడం జరిగిందన్నారు.
అలాగే జిల్లాలో రహదారుల మరమ్మతుకు గాను పామర్రు నియోజక వర్గానికి 28 కోట్ల రూపాయలు, గన్నవరం నియోజకవర్గానికి 27 కోట్ల రూపాయలు, గుడివాడ నియోజకవర్గానికి 16 కోట్ల రూపాయలు, అవనిగడ్డ నియోజకవర్గానికి 20 కోట్ల రూపాయలు, పెనమలూరు నియోజకవర్గానికి 15 కోట్ల రూపాయలు, పెడన నియోజకవర్గానికి 26 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు.
ఈ నిధులతో పనులు రహదారుల మరమ్మతు పనులు ముమవరంగా ముమ్మరంగా చేపట్టి త్వరలో పూర్తి చేస్తామన్నారు.
బందరు ఓడరేవు నిర్మాణాన్ని 50 శాతం పైగా పూర్తయిందని, ఇప్పటిదాకా 1760 కోట్ల రూపాయలు ఖర్చు అయినదని, ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి కచ్చితంగా పూర్తి చేస్తామన్నారు. ఇంకా 1700 కోట్ల రూపాయల మేరకు 42 శాతం పని మిగిలి ఉందని ఉందన్నారు.ఇకపై ప్రతినెలా సమీక్షించి ఎంత శాతం మేరకు పని పూర్తయిందో తెలుసుకుంటామన్నారు.
గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ నిర్మాణంలో. సాంకేతిక పరంగా కొన్ని సమస్యలు వచ్చాయ, ఈ సంవత్సరం జూన్ నెలాఖరికి పూర్తి చేస్తామన్నారు..
ఈ ప్రాంత వాసి హార్బర్ కోసం కృషిచేసిన పూర్వపు మంత్రివర్యులు నడికుదుటి నరసింహారావు పేరును హార్బర్ కు పెట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి సుముకత వ్యక్తం చేసి ప్రభుత్వ ఉత్తర్వులను కూడా జారీ చేశారన్నారు.మచిలీపట్నంతో పాటు జిల్లా ప్రజలందరి తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలుపుతున్నామమన్నారు.
ప్రతి మూడు నెలలకు ఒకసారి హార్బర్ నిర్మాణం పురోగతిని సమీక్షించి త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
మంత్రివర్యులు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మచిలీపట్నం నియోజకవర్గంలో 46 కోట్ల రూపాయల వ్యయంతో పలు రహదారుల నిర్మాణ పనులు చేపట్టామన్నారు. ఇందుకోసం నిధులు మంజూరు చేసిన మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
గత 5 సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వం రహదారుల నిర్మాణం కానీ, మరమ్మతు గాని పట్టించుకోలేదన్నారు.
తమ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 1,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసి రహదారుల మరమ్మతు ముఖ్యంగా గుంతలు పడిన రహదారులను పూడ్చివేశామన్నారు.
మచిలీపట్నం ఓడరేవు నిర్మాణం ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి పూర్తయి, కార్యకలాపాలు మొదలవుతాయన్నారు.
ఇప్పటివరకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి పురోగతిని సమీక్షించి నిర్మాణం పనులు వేగవంతం చేస్తామన్నారు.
గిలకలదిండి ఫిషింగ్ హార్బర్ నిర్మాణంలో సి మౌత్ కు సంబంధించి సరైన ఆకృతి లేక కొంత ఆలస్యమైందని ప్రస్తుతం చెన్నై ఐఐటీ నుండి ఆకృతులు వచ్చాయని ఇక పనులు వేగవంతం చేస్తామన్నారు.
వచ్చే మార్చి నెల 15 వ తేదీ నుండి వేట నిషేధం మొదలవుతుందనిx, జూన్ 15 నుండి హార్బర్ కార్యకలాపాలు మొదలయ్యేలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
గతంలో 1999లో హార్బర్ నిర్మాణానికి కృషిచేసిన మాజీ మత్స్యశాఖ మంత్రివర్యులు నడికుదిటి నరసింహారావు పేరిట హార్బర్ కు నామకరణం చేస్తూ ప్రభుత్వం జీ.వో. విడుదల చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, డీసీఎంఎస్ అధ్యక్షులు బండి రామకృష్ణ, బందరు ఓడరేవు సి ఈ రాఘవరావు ఎస్సీ నగేష్ ఈఈ కెవి పుల్లారావు, రహదారులు భవనాల శాఖ సీఈ ఎన్ శ్రీనివాసరెడ్డి, ఎస్ ఈ భాస్కర్, ఈ ఈ లోకేష్, మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ ఇంచార్జ్ అధికారి తులసీదాసు
వచ్చే శాఖ జేడి మత్స్యశాఖ జేడీ అయ్యా నాగరాజా
తదితర అధికారులు పాల్గొన్నారు.

