మచిలీపట్నం :
మారిషస్ రిపబ్లిక్ దేశ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్ జి సి ఎస్ కే కి గన్నవరం విమానాశ్రయంలో మంగళవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఘనంగా వీడ్కోలు పలికారు.
ఈనెల 3 వ తేదీన రాష్ట్రానికి అతిధిగా వచ్చిన మారిషస్ దేశాధ్యక్షులు, వారి కుటుంబ సభ్యులు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలలో 3 రోజుల పర్యటన ముగించుకొని గుంటూరు నుండి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాన్వాయిలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగా కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం వారు కాసేపు విమానాశ్రయం రిజర్వు లాంజిలో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అంతకుమునుపే గోవా గవర్నర్ గౌరవ పూసపాటి అశోక్ గజపతిరాజు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగా రిజర్వు లాంజిలో వారితో మారిషస్ దేశాధ్యక్షులు కాసేపు ముచ్చటించారు. తదుపరి రిజర్వ్ లాంజ్ లో రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ మారిషస్ దేశాధ్యక్షులతో కాసేపు ముచ్చటించారు.
తదనంతరం తిరుపతికి వెళుతున్న మారిషస్ దేశాధ్యక్షులు, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర, జిల్లా అధికార యంత్రాంగం ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వీ. విద్యాసాగర్ నాయుడు నేతృత్వంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.విజయవాడ ట్రాఫిక్ డిసిపి షరీనా బేగం ప్రముఖుల కాన్వాయ్కి ఎలాంటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేశారు.గుంటూరు నుండి కాన్వాయ్ ఇన్చార్జిగా ఏఆర్ డిఎస్పీ గాంధీ రెడ్డి వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో మారీషస్ దేశ హై కమిషన్ కార్యదర్శి గీతాంజలి,ప్రోటోకాల్ డైరెక్టర్ మోహన్ రావు, విమానాశ్రయం డైరెక్టర్ ఎమ్ ఎల్ కె రెడ్డి, టర్మినల్ ఇన్చార్జ్ అంకిత్ జైస్వాల్, సిఎస్ఓ ధర్మేంద్ర, గుడివాడ ఆర్డిఓ జి బాలసుబ్రమణ్యం, గన్నవరం డిఎస్పి శ్రీనివాసరావు, మచిలీపట్నం పిటిసి ఇన్చార్జ్ డిఎస్పి శ్రీనివాసరావు, జిల్లా ఆహార భద్రత తనిఖీ అధికారి గోపాలకృష్ణ, గన్నవరం తహసిల్దారు శివయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.