మచిలీపట్నం నగరంలో తొమ్మిదో తారీఖు, పదో తారీఖులలో రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా వీర్నాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోబెల్ కాలేజీ ప్రాంగణంలో పిల్లల కోసం విభిన్న రకాల క్రీడా, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
పిల్లల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించడం, శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కలిగించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పరుగు పందెం, చెస్, క్యారం బోర్డు, కబాడీతో పాటు మరెన్నో ఆటల పోటీలు నిర్వహించనున్నారు.
ఈ పోటీల్లో పాల్గొనే పిల్లలకు ప్రత్యేక బహుమతులు, ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు తెలిపారు.
సంక్రాంతి పండుగను పిల్లలతో కలిసి ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఫౌండేషన్ ప్రతినిధులు పిలుపునిచ్చారు.