మచిలీపట్నంలోని ఐఎంఏ హాలు నందు ఆసుపత్రి బయో మెడికల్ వ్యర్ధాల నిర్వహణ, నిర్వీణ్యం గురించి అవగాహన కార్యక్రమంను మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమమును ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి,డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్తంగా జరిపించారు. ఈ కార్యక్రమనందు హాస్పిటల్ వ్యర్ధాలను కలర్ కోడెడ్ బిన్సులో ఎలా విభజించాలి, వాటిని ఏ విధంగా నిర్వీణ్యం చేయాలి అనే దాని గురించి ఆసుపత్రి నిర్వాహకులకు, సిబ్బందికి మెడికల్ & ఫార్మసీ కాలేజ్ విద్యార్థులకు, పరిశ్రమ ప్రతినిధులకు అవగాహన కల్పించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ కె.వి రామ కృష్ణయ్య ఆసుపత్రి వ్యర్ధాలను సరిగా విభజించి వాటిని కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీకి పంపించి వ్యర్ధాలను పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందు లేకుండా నిర్వీణ్యం చేయాలని తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ వర ప్రసాద్ , సీనియర్ న్యాయవాది అజమత్ తనీషా, కాలుష్య నియంత్రణ మండలి ఈ ఈ పీ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది పాల్గొన్నారు.