మచిలీపట్నం :
అధికారులు రోగుల పట్ల విజ్ఞతతో మెలుగుతూ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న విశ్రాంతిభవనాన్ని మరలా ప్రారంభించాలని కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సేకు బోయిన సుబ్రమణ్యం డిమాండ్ చేశారు.
స్థానిక ఈడేపల్లి లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం లో మంగళవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు సౌకర్యార్థం 2020లో మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభ సభ్యుడుగా ఉన్న సమయంలో 20 లక్షల వ్యయంతో ప్రస్తుతం ఉన్న సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో విశ్రాంతి భవనాన్ని నిర్మించడం జరిగింది,ఎంతో మంది చికిత్స కోసం ఆస్పత్రికి చేరుకోగా వారికి సహాయర్థం ఎవరో ఒకరు వస్తారు. వారు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఆ భవన నిర్మించడం ఆనాడు జరిగింది,రోగి తరపున వచ్చిన బంధువులు భోజనాలు చేయడానికి విశ్రాంతి తీసుకోవడానికి సౌకర్యార్థం ఆ భవనాన్ని నిర్మించడం జరిగిందని ఆయన అన్నారు. దాన్ని ప్రస్తుతం ల్యాబ్ కింద వాడుకోవడం చాలా దారుణమని అన్నారు.
ప్రస్తుతం రోగుల కోసం వచ్చేవాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి ఆ ప్రాంతంలో ఏ విధమైన సౌకర్యాలు లేవు దానివల్ల వచ్చిన రోగుల బంధువులు నానా ఇబ్బందులు పడాల్సి అనే ఆవేదన వ్యక్తం చేశారు. 20 లక్షల వ్యయంతో ఆనాడు మెగాస్టార్ చిరంజీవి ఎంపీ నిధుల్ని వెచ్చించగా నేడు పాలకవర్గం రోగి బంధువుల ఇబ్బందులను పట్టించుకోకుండా చూడడం చాలా దారుణం. రోగితరు బంధువులు విశ్రాంతిభవనం లేకపోవడం వల్ల ఎక్కడపడితే అక్కడ భోజనాలు చేసి ఆ ప్రాంతాన్ని అంతా ఇబ్బంది గురయ్యాలా చేస్తున్నారు? ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ల ఇబ్బందులను ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ దృష్టిలో ఉంచుకొని ఆ ల్యాబ్ ను ఖాళీ చేయించి రోగుల కు, రోగి బంధువులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఆవిడ పై ఉందని బీసీ సంక్షేమం తరఫున మా అభిప్రాయమని ఆయన అన్నారు.
ప్రస్తుతం మన రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ దీనిపై దృష్టి సారించాలని నా విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జోగి శివ, భోగి రెడ్డి సుభాని, నిక్క రాధాకృష్ణ, బెల్లంకొండ రవి, బోయిన సాంబ, ఎం రామరాజు, చేయబోయిన కోటేశ్వరరావు, బోయిన రమేష్, ఎం గోపి తదితరులు పాల్గొన్నారు.