రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల భారం తగ్గించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకొందని, ఏపీఎస్ఆ ర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, గౌడ కోపరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియాకు తెలిపారు.
ఈ నిర్ణయంతో గృహ వినియోగదారులపై యూనిట్‌కు 13 పైసలు తగ్గించారని తెలిపారు. విద్యుత్ సరఫరా వ్యవస్థను ఆర్థికంగా స్థిరీకరించే దిశగా సంస్కరణలు చేపట్టడంపై ఆనందం వ్యక్తం చేశారు.
అక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ఛార్జీ రూ.3.50 నుంచి రూ.1.50కి తగ్గింపుతో అక్వా సాగుపై ఆధారపడే రైతులకు ఖర్చు గణనీయంగా తగ్గిందని ,రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేస్తూ వ్యయ నియంత్రణ చేపట్టడం అలానే ప్రస్తుతం యూనిట్ విద్యుత్ కొనుగోలు ధర సగటున రూ.4.70కి పరిమితం చేయటం ద్వారా కూటమి ప్రభుత్వం నాయకులు ప్రజలకి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిసిఎమ్ఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబుప్రసాద్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గొర్రిపాటి గోపీచంద్, వార్డ్ ఇన్‌చార్జిలు, టీడీపీ మహిళా నేతలు, జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులు స్థానికులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.