మచిలీపట్నం:
కుంకుమ అర్చన అనేది హిందూ సాంప్రదాయంలో ముఖ్యమైన పూజా విధానం అని బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్,
పి. వి. ఫణి కుమార్ అన్నారు. నాగులేరు కాలువ గట్టు, కాలే ఖాన్ పేటలో వేంచేసియున్న శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ సిద్ధి రసలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో ఆలయ అర్చకుడు బ్రహ్మశ్రీ కానుకోలను ఫణి కిరణ్ శర్మ దంపతుల ఆధ్వర్యంలో శ్రీ చండీ పూర్వక కోటి కుంకుమార్చన మహా యజ్ఞ మహోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున శనివారం
ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పి వి ఫణి కుమార్ మాట్లాడుతూ శ్రీ సిద్ధి రసలింగేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహంతో నిర్వహిస్తున్న శ్రీ చండీ పూర్వక కోటి కుంకుమార్చన మహా యజ్ఞం జనవరి 12వ తేదీ వరకు జరుగుతుందని ఈ బృహత్తర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి అని కోరారు.
ఆలయ అర్చకుడు, బ్రహ్మశ్రీ కాను కొలను ఫణి కిరణ్ శర్మ మాట్లాడుతూ…… కుంకుమ అర్చనను ప్రధానంగా దేవీమాతకు (లక్ష్మి, పార్వతి, దుర్గ అమ్మవార్లకు) నిర్వహిస్తారు అన్నారు. ఇందులో దేవతకు కుంకుమను సమర్పిస్తూ 108 లేదా 1008 నామాలతో అర్చన చేస్తారు. కుంకుమ శుభం, సౌభాగ్యం, ఐశ్వర్యానికి ప్రతీకగా భావించబడుతుంది అన్నారు. ఈ అర్చన చేయడం వల్ల కుటుంబం సుఖశాంతులు ఆరోగ్యం, సంపద, మంగళం కలుగుతాయని నమ్మకం అన్నారు. ప్రత్యేకంగా మహిళలు ఈ పూజను భక్తి తో నిర్వహిస్తే ఆ కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చోడవరపు లక్ష్మీప్రసన్న, ఆధ్యాత్మికవేత్త పి. ఆంజనేయ కుమార్, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, అనుమకొండ రామకృష్ణారావు, ఆరేవర పు దుర్గారావు, నున్న తాతారావు, కూరేటి మహేష్, అనుమకొండ ప్రసాదరావు, ఆరేవర పు వెంకటేశ్వరరావు, అర్జా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.