మచిలీపట్నం :
జనవరి 3 నుండి 12వ తేదీ వరకు విజయవాడలో ఇందిరా గాంధీ స్టేడియం నందు జరుగు 36 వ బుక్స్ ఫెస్టివల్ ఆంధ్ర ప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ వారు నిర్వహిస్తున్నారు. ఈ బుక్ స్టాల్ ను శనివారం రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులు ఏ. కృష్ణమోహన్ తో కలసి ప్రారంభించారు.
ఈ బుక్ స్టాల్ నందు అరుదైన పుస్తకాలు, తాళపత్ర గ్రంధాలు, విలువ గల పుస్తకములు,ఇతర అమూల్యమైన గ్రంథాలను ప్రదర్శనకు ఉంచారు. పౌర గ్రంథాలయ సంక్షిప్త సమాచారం, నన్నయ కాలం నాటి తాళ పత్ర గ్రంథములు, చేతితో వ్రాసే ఘటం, 13,14 శతాబ్దాల రాగి శాసనాలు, పురాతన బైబిల్, అమూల్యమైన గ్రంథాలు ప్రజలకు ప్రదర్శనార్థం ఏర్పాట్లు చేశారు. స్వాతంత్ర సమరయోధుల/ గ్రంథాలయ ఉద్యమకారుల /సాహితీ మూర్తుల చిత్రపటాలను బుక్ స్టాల్ నందు ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ అధికారులు, కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వేములపల్లి రవికుమార్, గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వి. సుబ్బ రత్నమ్మ , ఇతర జిల్లాల గ్రంథాలయ సంస్థ కార్యదర్శి లు, గ్రంథాలయాల సిబ్బంది, శిక్షణా ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు.