MachilipatnamLocal News
May 25, 2026
కృష్ణా జిల్లా

కెమెరాలతో అసాంఘిక శక్తుల ఆట కట్టిస్తున్న కృష్ణా జిల్లా పోలీస్ యంత్రాంగం

  • January 2, 2026
  • 1 min read
[addtoany]

మచిలీపట్నం:

జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలతో నిఘాను మరింత పటిష్టం చేశారు. జూద కార్యకలాపాలైన, ఆకతాయిల వేధింపులైన, బహిరంగ మద్య సేవనమైన, చట్ట వ్యతిరేక చర్యలు ఏవైనా ఆట కట్టిస్తామని కృష్ణా జిల్లా పోలీస్ యంత్రాంగం హెచ్చరించారు. 

గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బిల్లపాడు గ్రామ పరిధిలో పేకాట ఆడుతున్నారని వచ్చిన సమాచారం మేరకు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పేకాట ఆడుతున్న 12 మంది జూదగాళ్లను అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుండి 33,950/- రూపాయల నగదు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మల్లాయపాలెం గ్రామ శివారులో టిడ్కో గృహాల వద్ద. పేకాట ఆడుతున్నట్లుగా వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి పేకాట ఆడుతున్న 6 మంది వ్యక్తులను అదుపులోనికి తీసుకొని వారి వద్దనుండి 4500/- నగదు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశారు

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *