మచిలీపట్నం:
జిల్లాలో బాల్య వివాహాలు జరగకుండా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు
శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యకలాపాలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం . నిర్వహించి సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాల్య వివాహ ముక్తా భారత్ గోడపత్రాన్ని ఆవిష్కరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బాల్య వివాహా రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.
ఈ సమావేశంలో పిడి ఐ సి డి ఎస్ పి డి ఎం ఎన్.రాణి, నోడల్ అధికారి సుధారాణి, ఈవో విజయ లక్ష్మి జిల్లాలోనీ 8 ప్రాజెక్ట్ ల సిడిపిఓలు , శిశు సంరక్షణ అధికారి B. కిషోర్ , సంరక్షణ అధికారులు మధుబాబు,ప్రశాంతి, శైలజ, సమన్వయకర్త నాగరాజు తదితర ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.