ఎస్టీ జాబితాలో చేర్చడం పై కూటమి నాయకులతో చర్చిస్తాం.
మచిలీపట్నం :
ఆంధ్రప్రదేశ్ వడ్డెర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు రాష్ట్ర పర్యటనలో భాగంగా బుధవారం మచిలీపట్నంలో పర్యటించారు.
వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు ప్రప్రదమంగా కృష్ణాజిల్లా ప్రధాన కేంద్రమైన మచిలీపట్నంకు రావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, పెద్దలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో స్థానిక వడ్డెర నాయకులు, కుల బంధువులతో సమావేశం నిర్వహించారు. పలువురు వడ్డెర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వరరావు మాట్లాడుతూ వడ్డెర జాతి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. వడ్డెర ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకు వెళ్తానని హామీ ఇచ్చారు. సమస్యలను పరిష్కరించే విధంగా కూటమి ప్రభుత్వానికి చెందిన నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ,నారా లోకేష్ లు కట్టుబడి ఉన్నారని అన్నారు.
వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ ,పాలకమండలి సభ్యులు సమిష్టిగా వడ్డెర అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. మచిలీపట్నంలో వడ్డెర కుల బంధువులను కలిసినందుకు హర్షం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న సమస్యలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని అన్నారు. మచిలీపట్నంలో వడ్డెర సొసైటీలో స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. అనాది కాలముగా ఎదురుచూస్తున్న వడ్డెరల హక్కు ఎస్టీ జాబితాలో చేర్చడం పై ఆయన స్పందించారు. వడ్డెరలను ఎస్టి జాబితాలో చేర్చే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో వడ్డెర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ మహాలక్ష్మి, స్థానిక నాయకులు వేముల దుర్గారావు, శివరాత్రి నాగరాజు, గుంజ వీరన్న , బత్తుల దుర్గారావు, వేముల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.