MachilipatnamLocal News
January 14, 2026
కృష్ణా జిల్లా

కలెక్టర్ కు గ్యాస్ పై వినతి

  • December 29, 2025
  • 0 min read
[addtoany]
కలెక్టర్ కు గ్యాస్ పై వినతి
మచిలీపట్నం:
 
      వంట గ్యాస్ సిలిండర్లను కాటా పెట్టి ఇవ్వాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీ.కే బాలాజీకి, కృష్ణాజిల్లా బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు శేకుబోయిన సుబ్రహ్మణ్యం సోమవారం వినతిపత్రం సమర్పించారు. 
 
     ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గతంలో వంట గ్యాస్ సిలిండర్ ను ఇంటి వద్ద డెలివరీ ఇచ్చే సమయంలో కాటా పెట్టి ఇచ్చేవారని తెలియజేశారు. కానీ ప్రస్తుతం ఈ పద్ధతి అమల్లో లేకపోవడం వల్ల వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన విమర్శించారు. కాబట్టి గతంలో మాదిరిగా వంట గ్యాస్ సిలిండర్ ను కాటా పెట్టి వినియోగదారునికి డెలివరీ ఇవ్వాలని ఆయన కలెక్టర్ బాలాజీకి వినతిపత్రం సమర్పించారు. 
 
      ఈ కార్యక్రమంలో జన్ను గోవిందు, నిక్కు రాధాకృష్ణ, అన్సారి, బెల్లంకొండ రవి, బోయిన రమేష్, ఎం.పవన్ తదితర బి.సి నాయకులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *