గోదాములో ఉన్న సీసీ కెమెరాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా, విద్యుత్ సౌకర్యం సరిగా ఉందా లేదా అనే విషయమై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా కెమెరాలు గాని విద్యుత్ పరికరాలు గాని పనిచేయకపోతే వెంటనే మార్చాలన్నారు.
ఈ తనిఖీ లో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు,, ఈవీఎం నోడల్ అధికారి నిత్యానందం, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి, కార్యాలయ కార్యదర్శి దాసు, సిపిఎం, బిజెపి వైసిపి, బి ఎస్ పి పార్టీల ప్రతినిధులు సుబ్రమణ్యం, పంతం గజేంద్ర రావు, సిలార్ దాదా, బాలాజీ, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారి శ్యామ్ తదితర అధికారులు పాల్గొన్నారు.