MachilipatnamLocal News
November 23, 2026
మచిలీపట్నం

భగవద్గీత శ్లోక పఠన పోటీల్లో ఎస్.వి. పబ్లిక్ స్కూల్ విద్యార్థి కే. సాయి హర్షిత్‌కు ప్రథమ బహుమతి

  • November 23, 2026
  • 0 min read
భగవద్గీత శ్లోక పఠన పోటీల్లో ఎస్.వి. పబ్లిక్ స్కూల్ విద్యార్థి కే. సాయి హర్షిత్‌కు ప్రథమ బహుమతి

మచిలీపట్నం:

కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత శ్లోక పఠన పోటీల్లో ఎస్.వి. పబ్లిక్ స్కూల్ (సీబీఎస్ఈ అనుబంధ) 6వ తరగతి విద్యార్థి కే. సాయి హర్షిత్ ప్రథమ బహుమతి సాధించారు. ఈ పోటీల్లో సాయి హర్షిత్ అత్యంత స్పష్టమైన ఉచ్చారణ, మధురమైన స్వరంతో భగవద్గీత శ్లోకాలను పఠించి న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకున్నారు.

ఈ సందర్భంగా సాయిహర్షిత్‌ను పాఠశాల ప్రిన్సిపాల్ టి విజయ ప్రత్యేకంగా అభినందించారు. చిన్న వయసులోనే ఆధ్యాత్మిక గ్రంథాలపై పట్టు సాధించడం అభినందనీయమని, విద్యార్థులు చదువుతో పాటు ఇలాంటి సాంస్కృతిక, నైతిక విలువలు పెంపొందించే పోటీల్లో చురుగ్గా పాల్గొనాలని ఆమె ఆకాంక్షించారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు తోటి విద్యార్థులు హర్షిత్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author

SSN