MachilipatnamLocal News
October 22, 2026
మచిలీపట్నం

కనకాపరమేశ్వరి దేవాలయంలో అగ్ని ప్రమాదం – అప్రమత్తమైన సిబ్బంది

  • October 22, 2026
  • 0 min read
కనకాపరమేశ్వరి దేవాలయంలో అగ్ని ప్రమాదం – అప్రమత్తమైన సిబ్బంది

మచిలీపట్నం: 

స్థానిక ప్రసిద్ధ కనకాపరమేశ్వరి దేవాలయంలో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీపారాధన కోసం వెలిగించిన జ్యోతి కారణంగా ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి దేవాలయానికి చేరుకుని, సకాలంలో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటనపై దేవస్థాన కమిటీ నిర్వాహకులు మామిడి మురళీకృష్ణ, మోటమర్రి బాబా ప్రసాద్ వెంటనే ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం ప్రమాదానికి గల అసలు కారణాలపై ఫైర్ సిబ్బంది సమగ్ర విచారణ మరియు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

About Author

SSN